AP: ఢిల్లీ లిక్కర్ స్కాం కన్నా మాజీ సీఎం జగన్ మద్యం కుంభకోణం అతి పెద్దదని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. లిక్కర్ ఉత్పత్తికి ముందే స్కాం చేసిన ఘనత జగన్‌ది అని తెలిపారు. జగన్ తన ఆధీనంలోని సంస్థల ద్వారా మద్యం వ్యాపారాన్ని నియంత్రించి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ప్రముఖ మద్యం బ్రాండ్లను పూర్తిగా తొలగించి నాసిరకం బ్రాండ్లను ప్రవేశపెట్టారని మండిపడ్డారు.