PPM: పార్వతీపురం పురపాలక కౌన్సిల్ ఎన్నికయి నాలుగేళ్లయిన ఇప్పటివరకు వారి తీరులో మార్పు రాలేదని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. సోమవారం పురపాలక ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల అవిశ్వాస తీర్మాన పత్రాలను జేసీ శోభిక, కమిషనర్ వెంకటేశ్వర్లకు అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు . వైసీపీ హయాంలో ఏర్పాటు అయిన కౌన్సిల్ పట్టణ అభివృద్ధిలో పూర్తిగా విఫలమైందన్నారు.