CTR : కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారికి భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను ఆలయ ఆస్థాన మండపంలో మంగళవారం లెక్కించనున్నట్లు ఈవో పి. గురుప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లెక్కింపునకు ఆలయ అధికారులు, సిబ్బంది హాజరు కావాలని కోరారు. లెక్కింపు అనంతరం ఆదాయ వివరాలు వెల్లడిస్తామన్నారు.