టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో తెలుగుదేం పార్టీ బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ బంద్ ఫెయిల్ అయిందంటూ కనీసం చంద్రబాబు సొంత కంపెనీ హెరిటేజ్ కూడా మూతబడలేదని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా మంత్రి రోజా(Minister Roja) కూడా తన సామాజిక అనుసంధాన వేదిక ఎక్స్ (Twitter)లో హెరిటేజ్ తెరిచి ఉందంటూ ఓ పోస్ట్ పెట్టారు. కనీసం నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరి (Bhuvaneshwari) కూడా ఈ బంద్ పాటించలేదని ఎద్దేవా చేశారు.
‘బాబు భార్య (భువనేశ్వరి), లోకేష్ భార్య (Brahmani) కూడా ఆ బంద్ పాటించలేదు.. బంద్ లేదు.. బొంద లేదు.. అని బార్లా తెరుచుకున్న హెరిటేజ్(Heritage) సంస్థలు. చంద్రబాబు కుటుంబానికి వాళ్ళ వ్యాపారం బాగుండాలి.. ఆయన కోసం ఇతరులు మాత్రం బంద్ పాటించాలా..? వీరి నైజం తెలుసు కాబట్టే ఏపీ ప్రజలు బంద్ని విఫలం చేశారు.’ అని ట్వీట్ చేశారు. చంద్రబాబు రిమాండ్ (Remand) రిపోర్టుపై విమర్శలు చేస్తూ మంత్రి రోజా నోరు జారారు. ‘అవినీతి ఆంధ్రప్రదేశ్ సృష్టిస్తాం’ అని ఆమె చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇలాంటి వారిని మంత్రులను చేస్తారా? అని జనసేన(Janasena)నేతలు సెటైర్లు వేస్తున్నారు.
చంద్రబాబు భార్య, లోకేష్ భార్యా కూడా ఆ బంద్ పాటించలేదు.. బంద్ లేదు.. బొంద లేదు.. అని బార్లా తెరుచుకున్న హెరిటేజ్ @hfltd సంస్థలు, చంద్రబాబు కుటుంబానికి వాళ్ళ వ్యాపారం బాగుండాలి.. ఆయన కోసం ఇతరులు మాత్రం బంద్ పాటించాలా..? వీరి నైజం తెలుసు కాబట్టే #AndhraPradesh ప్రజలు బంద్ ని విఫలం… pic.twitter.com/1qJR1qPbtZ