వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి(Ys Bhaskar Reddy), ఉదయ్లకు నాంపల్లి సీబీఐ(CBI) కోర్టు 6 రోజుల కస్టడీ విధించింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు వైఎస్.భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను అరెస్ట్ చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు వారికి 6 రోజుల కస్టడీ(Custody)ని విధిస్తూ తీర్పునిచ్చింది.
వైఎస్ వివేకానంద రెడ్డి(Ys Vivekananda Reddy) హత్యకు వైఎస్ భాస్కర్ రెడ్డి(Ys Bhaskar Reddy) నెల రోజులకు ముందే కుట్ర పన్నినట్లు సీబీఐ(CBI) అధికారులు గుర్తించారు. హత్యకు రూ.40 కోట్లను వెచ్చించినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. ఈ హత్యా కుట్రలో నాలుగైదు కోట్ల రూపాయల వరకూ ఇప్పటికే చేతులు మారినట్లుగా సీబీఐ అధికారులు కోర్టుకు వివరించారు.
వైఎస్ భాస్కర్ రెడ్డి(Ys Bhaskar Reddy) సీబీఐ(CBI) విచారణలో సరైన సమాధానాలు ఇవ్వడం లేదని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. అందుకే వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే వైఎస్ వివేకా(Ys Vivekananda Reddy) హత్య కేసులో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని సీబీఐ(CBI) కోర్టుకు వివరించింది.
ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు వైఎస్ భాస్కర్ రెడ్డి(Ys Bhaskar Reddy), ఉదయ్లకు 6 రోజుల సీబీఐ(CBI) కస్టడీ విధించింది. రేపటి నుంచి ఏప్రిల్ 24వ తేది వరకూ ఇద్దరూ సీబీఐ కస్టడీలో ఉంటారు. సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు ఇప్పుడు చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న సంగతి తెలిసిందే. మరో వైపు అవినాష్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు అవినాష్ రెడ్డికి మందస్తు బెయిల్ మంజూరైంది.