AKP: కోటవురట్ల విద్యుత్ సబ్ స్టేషన్ రాజుపేట ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మలు తొలగింపు పనులు జరుగుతున్నందున శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని డీఈ విఎన్ఎం అప్పారావు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. దీనికి వినియోగదారులు సహకరించాలని కోరారు.