KKD: తుని మండలం ఎర్రకోనేరు సమీప జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అన్నవరం నుంచి విశాఖ వెళ్తున్న BMW కారు, ముందున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి ఆటో డివైడర్ను దాటి అవతలి వైపునకు దూసుకెళ్లి పూర్తిగా ధ్వంసమైంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు.