నేడు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నివాళులర్పించారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను సంజయ్ కొనియాడారు. తొలి తెలంగాణ ఉద్యమ నేత మర్రి చెన్నారెడ్డి అంటూ ఆయన ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్ లో వేలకోట్ల నిజాం అక్రమ ఆస్తులను, స్థలాలను కబ్జా కాకుండా అడ్డుకొని తెలిపారు. అవీ ప్రజలకు ఉపయోగపడేలా చేశారని గుర్తుచేశారు. 1969లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసేందుకు చెన్నారెడ్డి కారణం అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాల్సిందేనని, అప్పుడే ఈ ప్రాంతం వారి బతుకులు మారతాయని చెప్పారని బండి సంజయ్ అన్నారు.
మర్రి చెన్నారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్న సమయంలో ముఖ్యమంత్రి పదవి ఆశ చూపడంతో ఉద్యమాన్ని నీరుగార్చారనే అపవాదు ఉంది. ఆయన కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి మొన్నటివరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ మధ్యే బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌పై ధిక్కార స్వరం వినిపించిన శశిధర్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. శశిధర్ రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత ఆ పార్టీ నేతలు చెన్నారెడ్డి గొప్పతనం గురించి మాట్లాడుతున్నారు. అంతకు ముందు ఆయన గొప్పతనం బీజేపీ నేతలకు తెలియదా? అని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. బీజేపీలో చేరితేనే గొప్పవారిని గొప్పవారిగా గుర్తిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.