బాలయ్య అన్ స్టాపబుల్ షో అదరగొడుతోంది. మొదటి సీజన్ కంటే… సెకండ్ సీజన్ మరింత సూపర్ గా ఆకట్టుకుంటోంది. ఈ సెకండ్ సీజన్ లో మొదటి ఎపిసోడ్ చంద్రబాబుతో మొదలుపెట్టాడు. ఆ తర్వాత కొందరు సినిమా వాళ్లతో రెండు, మూడు ఎపిసోడ్ లు చేయగా మళ్లీ… మరో పొలిటికల్ లీడర్ ని పిలుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే… పిలిచే రాజకీయ నాయకులందరూ జగన్ కి వ్యతిరేకంగా ఉన్నవారే కావడం గమనార్హం.
ఈ శుక్రవారం ప్రసారం కాబోయే అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గెస్ట్ గా హాజరు కానున్నారని సమాచారం అందుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి కొంతకాలం పాటు జగన్ కు వ్యతిరేకంగా వ్యవహరించారు. ఈయన చంద్రబాబు సన్నిహితులలో ఒకరు కావడం గమనార్హం. కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సమయంలో ఏపీకి కలిగిన లాభం కంటే నష్టమే ఎక్కువనే సంగతి తెలిసిందే.
అయితే జగన్ శత్రువులను ఆహ్వానిస్తూ జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం జరిగే దిశగా బాలయ్య అడుగులు వేస్తుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ శత్రువులు అంటే బాలయ్యకు అంత ఇష్టమా అని కొంతమంది వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య రేంజ్ కు తగిన అతిథులు ఈ షోకు హాజరు కాకపోవడంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బాలయ్య డైరెక్ట్ గా జగన్ సర్కార్ పై విమర్శలు చేయలేక ఈ విధంగా జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే జగన్ కి వ్యతిరేకంగా ఉన్న నేతలను పిలుస్తున్నారని కొందరు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.