అనంతపురంలోని సిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. 300 బెడ్లతో నిర్మించిన ఈ ఆసుపత్రిని ఎమ్మెల్యేలు పరిటాల సునీత, సింధూరరెడ్డి, దగ్గుపాటి ప్రసాద్, సురేంద్రబాబు, కందికుంట వెంకట ప్రసాద్, గుమ్మనూరు జయరాం, ఎంపీ అంబికాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటు ధరలో వైద్య సేవలు అందించాలని ఆసుపత్రికి సిబ్బందికి సూచించారు.