NDL: బేతంచెర్ల మండలం రంగాపురం గ్రామంలో ఇవాళ మహబూబ్ భాష అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై రమేష్ బాబు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పాతకక్షలతోనే మహబూబ్ బాషాను హత్య చేసి ఉంటారని పేర్కొన్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు SI కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని తెలిపారు.