TPT: తిరుపతి నగరపాలక సంస్థలో ఈ నెల 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. అలాగే ఉదయం 10.30 నుంచి 11.30 వరకు “డయల్ యువర్ కమిషనర్” కార్యక్రమం జరుగుతుంది. ఫోన్ ద్వారా ఫిర్యాదులు చేయాలనుకునే వారు 0877-2227208 నంబర్‌కు కాల్ చేయవచ్చని అధికారులు తెలిపారు. వినతిపత్రం, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ ఇవ్వాలన్నారు.