VSP: బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో మత్స్యకారులకు ఇంతవరకూ ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదని అమర్నాథ్ మండిపడ్డారు. దీంతో ఈ నెల 22న చలో రాజయ్యపేట కార్యక్రమం చేపడుతున్నామని వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డ్రగ్ పార్క్‌ను చంద్రబాబు వ్యతిరేకించారు. అమరావతిలో వేల ఎకరాలు తీసుకుంటున్న చంద్రబాబు ఈ ప్రాజెక్టును అక్కడే పెట్టుకోండి అని ఫైర్ అయ్యారు.