అనంతపురం మార్కెట్ యార్డు ఛైర్మన్గా బల్లా పల్లవి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మార్కెట్ యార్డు ఆవరణలో జరగనున్న ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు, కూటమి నేతలు హాజరుకానున్నారు. రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ, యార్డు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.