కృష్ణా: మోపిదేవిలోని ప్రధాన రహదారిలో కాలువ గట్టు పక్కన ఉన్న పోరంబోకు స్థలంలో నాలుగు గృహాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా శనివారం అగ్నికి ఆహుతి అయ్యాయి. రోడ్డు పక్కన నాలుగు కుటుంబాల వారి గృహాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అంటుకుని తగలబడ్డాయి. అవనిగడ్డ ఫైర్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలాన్ని చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.