TPT: శ్రీకాళహస్తి( M) సూరవారిపల్లి గ్రామంలో బుధవారం రాత్రి ఓ ఇంట్లో దొంగలు పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు.. అదే గ్రామానికి చెందిన ప్రసాద్ నాయుడు అనే వ్యక్తి ఇంట్లో ఎవరు లేని సమయంలో తలుపులు పగలకొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లోని బీరువాలోని వస్తువులను చల్లా చెదురు చేశారు. బీరువాలో దాచి ఉంచిన రూ.15 లక్షలు విలువ చేసే నగలు, నగదు దోచుకుని వెళ్లినట్లు సమాచారం.