VKB: రోడ్లు గుంతలుగా మారి ఇబ్బందులు పడుతున్నామని వికారాబాద్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెలిఫోన్ ఎక్స్చేంజ్ నుంచి అస్సాం బేకరీ వరకు, పురుషోత్తం ఆసుపత్రి నుంచి ఫైర్ స్టేషన్ వరకు రోడ్లు అధ్వానంగా మారాయి. పాలకుల నిర్లక్ష్యంతో రోడ్లు గుంతలు పడ్డాయని ప్రజలు చెబుతున్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.