అల్లూరి: భారీ వర్షాలకు లోతట్టు గ్రామాలకు చెందిన పలువురు ప్రజలను జీకేవీధి మండలం ధారకొండ, సప్పర్ల గ్రామాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించామని మండల తహసీల్దార్ హెచ్.అన్నాజీరావు తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారిని గురువారం అక్కడనుంచి వారి వారి స్వగ్రామాలకు తరలించామన్నారు. ప్రత్యేక వాహనాలను ఏర్పాటుచేసి వారిని వారి వారి ఇళ్లకు తరలించామని తెలిపారు.