KDP: బద్వేల్ నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పలువురికి అందజేశారు. గురువారం ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ. 28,24,385 విలువైన చెక్కులను టీడీపీ ఇంఛార్జ్ రితేష్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా, పేదల వైద్య ఖర్చులకు చంద్రబాబు నాయుడు సీఎం సహాయనిధి ద్వారా అండగా నిలుస్తున్నారని ఆయన అన్నారు.