GNTR: పెదకాకాని మండల పరిధిలోని పార్టీ కార్యాలయం వద్ద బుధవారం పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులు వచ్చి తమ సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు. సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పలువురు అధికారులను పిలిపించి అక్కడికక్కడే కొన్ని సమస్యలను పరిష్కరించారు.