ప్రకాశం: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి AP టీచర్స్ ఫెడరేషన్ నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల తెలిపారు. మంగళవారం మార్కాపురంలోని టీచర్స్ ఫెడరేషన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. నూతన పీఆర్సీ కమిషన్ నియమించాలని, 30% ఐఆర్‌ను ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాయబ్ రసూల్ పాల్గొన్నారు.