ASR: దసరా సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం రోజునే విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలని చింతపల్లి ఏటీడబ్ల్యూవో నాగలక్ష్మి విద్యార్థులకు సూచించారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు ఈనెల 3 నుంచి ప్రారంభమవుతాయన్నారు. సెలవులకు ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు హాజరు కావాలన్నారు. పాఠశాలకు వచ్చిన వెంటనే విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయించాలని సిబ్బందిని ఆదేశించారు.