నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు హత్యాయత్నం కేసు నమోదయింది. వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఈ కేసు కొట్టేయాలన్న వాదనకు హైకోర్టు నో చెప్పింది.
నెల్లూరు రూరల్ (Nellore Rural) ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి (Kotamreddy Sridahar Reddy) హైకోర్టులో (High Court) షాక్ తగిలింది. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు హత్యాయత్నం కేసు నమోదయింది. వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. టీడీపీ కార్యకర్త మాతంగి వెంకటకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసును బుక్ చేశారు పోలీసులు. అయితే ఈ కేసును కొట్టి వేయాలని, దర్యాఫ్తును నిలిపివేయాలని, అరెస్టు నుండి రక్షించాలని హైకోర్టుకు వెళ్లారు. పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం కేసు కొట్టివేతకు నిరాకరించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులు, వెంకటకృష్ణకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదయిన కేసులో ఫిర్యాదుదారుడి వాదనలు వినకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని, ఈ మేరకు సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
ఇలా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే మిగిలిన కేసుల్లోను ఇలాంటి పిటిషన్లు పెద్ద ఎత్తున వస్తాయని న్యాయమూర్తి తెలిపారు. అనంతరం విచారణను రెండు వారాలు వాయిదా వేశారు. పోలీసుల తరఫున అదనపు అడ్వోకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే ముందు ఫిర్యాదుదారు వాదన వినాలని భారత అత్యున్నత న్యాయస్థానం చెప్పిందని గుర్తు చేశారు. కోటంరెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాజకీయ కారణాలతో ఈ కేసును నమోదు చేశారన్నారు.