CM Jagan: అభిమానుల ఓట్లను హోల్ సేల్‌గా అమ్ముకుంటున్నారు.. పవన్‌పై కామెంట్స్
సరుకును అమ్ముకునే వారిని చూశాం.. సరంజామాను అమ్ముకునే వారిని చూశామన్నారు. సొంత పార్టీని, సొంత వర్గాన్ని.. వేరే వారికి అమ్ముకునే వ్యాపారిని మాత్రం ఇక్కడే చూస్తున్నామని పవన్ కల్యాణ్‌పై ఏపీ సీఎం జగన్ విరుచుకుపడ్డారు.
The CM jagan ordered to collect the grain due to the Michaung effect of the storm
CM Jagan: అభిమానుల ఓట్లను హోల్ సేల్‌గా అమ్ముకునేందుకు అప్పుడప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వస్తుంటారని సీఎం జగన్ (CM Jagan) విమర్శించారు. ఆయనది యూజ్ అండ్ త్రో పాలసీ అని మండిపడ్డారు. సరుకును అమ్ముకునే వారిని చూశాం.. సరంజామాను అమ్ముకునే వారిని చూశామన్నారు. సొంత పార్టీని, సొంత వర్గాన్ని.. వేరే వారికి అమ్ముకునే వ్యాపారిని మాత్రం ఇక్కడే చూస్తున్నామని విరుచుకుపడ్డారు. సామర్లకోటలో బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. అంతకుముందు అక్కడ జగనన్న కాలనీలను ప్రారంభించారు.
రెండు షూటింగుల మధ్య విరామంలో.. అప్పుడో, ఎప్పుడో ఒకసారి ఏపీకి పవన్ కల్యాణ్ వస్తారని సీఎం జగన్ విరుచుకుపడ్డారు. పవన్‌కు విలువలు లేవని ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యక్తి ప్రేమ, ఆప్యాయత ఉండదని పేర్కొన్నారు. ఏపీకి మంచి చేయాలని ఆలోచన పవన్‌కు ఉండదన్నారు. పవన్- చంద్రబాబు ఆలోచన దోచుకోవాలని.. దోచుకుంది.. హైదరాబాద్‌లో పంచుకోవడమేనని మండిపడ్డారు. రాష్ట్రం మీద ప్రేమ లేదని, ప్రజల మీద ప్రేమ లేదని.. అందుకే వారు కనిపించరని ధ్వజమెత్తారు. కానీ ప్రతీ క్షణం బాబుకు అధికారం ఇవ్వలేదని మాట్లాడతారని ప్రస్తావించారు.
చంద్రబాబు నుంచి అధికారం పోవడంతో అందరికీ ఫ్యూజులు పోయాయని సీఎం జగన్ సెటైర్లు వేశారు. ఆదాయాలు పోతాయి కాబట్టి.. ఫ్యూజ్ పోతాయని చెప్పారు. మన మట్టితో, మనుషులతో కానీ.. రాష్ట్రంతో బంధం, అనుబంధం వారికి లేదన్నారు. ఏపీ ప్రజలతో చేసేది వ్యాపారమేనని విరుచుకుపడ్డారు. ఎస్సీలను తన ఎస్సీలు, తన బీసీలు, తన మైనార్టీలు అని చెప్పుకోలేరని పేర్కొన్నారు. చివరికీ కాపులను తన కాపులని చెప్పుకోలేని వారని జగన్ విమర్శించారు. పేదలను పట్టించుకోరని వివరించారు.
ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా..? అని కామెంట్లు చేస్తారని గుర్తుచేశారు. పేదలకు ఇళ్లు కేటాయిస్తే, కులాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందని కోర్టులో కేసులు వేస్తారని గుర్తుచేశారు.