Ambati Rambabu : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు విమర్శల వర్షం కురిపించారు. ఆయనతో పాటు లోకేష్, పవన్ కళ్యాణ్ ని సైతం వదల్లేదు. చంద్రబాబు అతి మానిప్యూలేటర్ అని ఆరోపించారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు విమర్శల వర్షం కురిపించారు. ఆయనతో పాటు లోకేష్, పవన్ కళ్యాణ్ ని సైతం వదల్లేదు. చంద్రబాబు అతి మానిప్యూలేటర్ అని ఆరోపించారు. వ్యవస్థలను మేనేజ్ చేసి మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారని అన్నారు.
అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని చంద్రబాబు చెపుతున్నారని… కానీ ఆయన అధికారంలోకి వస్తే ఆయన ఆస్తులను, కొడుకు లోకేశ్ ను పునర్నిర్మిస్తాడని, రాష్ట్రానికి మాత్రం ఏమీ ఒరగదని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టును నాశనం చేసినట్టే మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేస్తారని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో జరిగిన తప్పిదాలన్నింటికీ టీడీపీనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం కావడం వల్ల దాని అంచనా వ్యయం భారీగా పెరిగిందని అన్నారు. చంద్రబాబు కోసమే జనసేనాని పవన్ క్యలాణ్ పుట్టాడని, ఆయనను దేవుడే రక్షించాలని అన్నారు.