KDP: మైదుకూరులో రైతు సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం జాతీయ రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ఏవి. రమణ కేక్ కట్ చేసి మాట్లాడుతూ.. ఎండనక, వాననక కష్టపడి ప్రజల ఆకలి తీర్చే రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు. గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారని, సమస్యల పరిష్కారానికి రైతులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.