ATP: జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు పోలీసు రిసెప్షనిస్టులు, కంప్యూటర్ ఆపరేటర్లు, రైటర్లకు ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ప్రజల ఫిర్యాదులను PGRS పోర్టల్లో నమోదు చేసి పరిష్కార చర్యలు తీసుకోవడం, ఐరాడ్ యాప్ ద్వారా రోడ్డు ప్రమాద వివరాలను నమోదు చేసే విధానంపై అవగాహన కల్పించారు. డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్ సోమ్లానాయక్ పాల్గొన్నారు.