W.G: తణుకు మండలం ముద్దాపురం యువతి ముళ్ళపూడి నాగ హారిక హత్య కేసులో ఎలాంటి విచారణకైనా మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సిద్ధంగా ఉన్నారని వైసీపీ లీగల్ సభ్యుడు వెలగల సాయిబాబా రెడ్డి పేర్కొన్నారు. హత్య కేసులో కారుమూరి హస్తం ఉందని ఎమ్మెల్యే రాధాకృష్ణ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. యువతి హత్య కేసుతోపాటు లేహ్యం ఫుడ్స్ అంశాల పైన విచారణ వేయాలని డిమాండ్ చేశారు.