కడప: రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని తులసిరెడ్డి అన్నారు. శనివారం వేముల మండలం బెస్తవారిపల్లెలో అరటి తోటలను సందర్శించారు. గత ఏడాది రూ.15 వేలతో కొంత లాభం వచ్చినా.. ఈ సంవత్సరం కొనుగోలుదారులే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పంటలకూ ఇదే పరిస్థితి నెలకొన్నదని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసి టన్ను రూ.15 వేలతో అరటిని కొనుగోలు చేయాలన్నారు.