KKD: వైసీపీ నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ప్రత్తిపాడుకు చెందిన ముదునూరి మురళీ కృష్ణంరాజు తండ్రి ముదునూరి రామరాజుపై కూటమి ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసుపై మురళీకి మాజీ సీఎం జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. కూటమి ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసును తీవ్రంగా ఖండిస్తున్నామని, పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.