సత్యసాయి: పుట్టపర్తి కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్‌ను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, శాంతి భద్రతల అంశాలపై పరస్పరం చర్చించారు. జిల్లా అభివృద్ధికి సమిష్టిగా పని చేద్దామని పిలుపునిచ్చారు. అయితే అప్పటి కలెక్టర్ టీఎస్. చేతన్, ఎస్పీ రత్న బదిలీ కావడంతో ఇరువురూ నూతనంగా బాధ్యతలు చేపట్టారు.