PLD: ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామ దేవత చౌడేశ్వరి అమ్మవారి తిరునాళ్ల ఆదివారం నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. తిరుణాలను పురస్కరించుకొని శనివారం జల బిందెల ఊరేగింపు నిర్వహించారు. తిరుణాల ఆదివారం ఉదయం అమ్మవారికి అభిషేకాలు చేస్తారు. అమ్మవారిని పూలతో ప్రత్యేకంగా అలంకరిస్తారని పేర్కొన్నారు.