W.G: రసధుని సాహిత్య సంస్థ, వాసవీ ఆర్య వైశ్య సంఘం సంయుక్తంగా గురువారం పాలకొల్లులో నిర్వహించిన ఉగాది వేడుకలలో భాగంగా నిర్వహించిన ఉగాది కవి సమ్మేళనంలో పాలకొల్లుకు చెందిన ఉపాధ్యాయుడు, కవి కొల్లాబత్తుల సూర్య కుమార్ పాల్గొన్నారు. ఉగాది పండుగ వైశిష్ఠ్యపై ‘నవ జీవన గమనాలు’ అనే శీర్షికతో కవితను ఆలపించి ప్రేక్షకుల మన్ననలను పొందారు.