W.G: సంక్రాంతికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు మద్యం వెంట తీసుకురాకూడదని ఆకివీడు ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు సోమవారం హెచ్చరించారు. ప్రైవేట్ బస్సులు, టాక్సీల్లో విదేశీ మద్యం అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలు సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.