ATP: గుంతకల్లులో సోమవారం మున్సిపల్ కమిషనర్ నయూమ్ అహ్మద్ ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చైర్ పర్సన్ భవాని అధ్యక్షత వహించారు. మున్సిపాలిటీలోని ప్రజా సమస్యలపై పలువురు కౌన్సిలర్లు అధికారులతో వాగ్వావాదానికి దిగారు. వార్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా, దోమల బెడద ఎక్కువగా ఉందన్నారు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని చైర్ పర్సన్ హామీ ఇచ్చారు.