E.G: నగర పరిధిలో చేపట్టే ప్రతి నిర్మాణానికి నగరపాలక సంస్థ అనుమతి తప్పనిసరని కమిషనర్ రాహుల్ మీనా స్పష్టం చేశారు. మంగళవారం ఆయన సీతంపేట, గాదాలమ్మ నగర్ ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. స్థానికంగా నిర్మిస్తున్న భవనాలకు సంబంధించిన పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులను, లేఅవుట్ ప్లాన్లను తనిఖీ చేశారు. ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే నోటీసులు జారీ చేస్తామన్నారు.