W.G: తాడేపల్లిగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి. చంద్రశేఖర్ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు కలిశారు. ఈ సందర్భంగా గ్రామాల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు ప్రతి ఇంటికి చేరేలా కృషి చేయాలని సూచించారు.