JN: స్టేషన్ ఘనపూర్ మండలంలోని నమిలిగొండలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో చెరువు పొంగి, పొలాల్లో వరి పంట నీటమునిగింది. ఈ భారీ పంట నష్టంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాలు, ఎరువులు, కూలీలకు చేసిన ఖర్చు వృథా కావడంతో రైతులు నిరాశకు గురయ్యారు. ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణం స్పందించి నష్టపరిహారం అందించాలని రైతులు కోరారు.