SKLM: సోంపేట మండలం బారువ గ్రామ పంచాయతీలో ఇంటి పన్నులు వసూలు కొరకు ప్రత్యేక డ్రైవ్‌ను ఈవో యల్.లక్ష్మణ మూర్తి ఆదివారం నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధికారి కె.సౌజన్య భారతి ఆదేశాలు మేరకు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేశమన్నారు. ఈ నెల ఆఖరికి ఇంటి పన్ను వసూలు శతశాతము పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.