పసిపిల్ల వాడిని ఎత్తుకొని మరీ వెళ్లి అక్రమ మైనింగ్ మాఫీయా ఓ లేడీ వీఆర్వో (Lady VRO) అడ్డుకుంది. కృష్ణా జిల్లా పామర్రు (Palmer) మండలం కొత్తూరులో ఈ సంఘటన జరిగింది. ఇసుక మాఫియా (Sand Mafia) పట్ల సింహస్వప్నంగా మారింది. అక్రమంగా మైనింగ్ తరలిస్తున్నారనే సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన వీఆర్వో మీనా (VRO Meena) రెండు లారీలను సీజ్ చేసింది. పసుమర్రులో అక్రమ మైనింగ్ జరుగుతుందని స్థానిక వీఆర్వోకి ప్రజలు సమాచారం అందించారు. అయితే ఆ వీఆర్వో స్పందించలేదు. కానీ కొత్తూరు(Kothur)లో మాత్రం లేడీ వీఆర్వో మీనా రెండు వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా సిన్సియర్‌గా విధులు నిర్వహించిన మీనాను స్థానిక ప్రజలు అభినందించారు. అక్రమ మైనింగ్ అడ్డూఅదుపు లేకుండా సాగుతోంది. ఇష్టారాజ్యంగా గనుల తవ్వకం జరుగుతోంది. తవ్వుకున్నవాళ్లకు తవ్వుకున్నంత అన్నట్లు మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. అక్రమ మైనింగ్‌తో వందల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.