W.G: సిద్ధాంతాల కోసం కట్టుబడి, ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి చింతకాయల బాబురావు అని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం తాడేపల్లిగూడెం వీకర్స్ కాలనీలో జరిగిన సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. కార్మికులు సంఘటితంగా పనిచేసేలా ఐక్యం చేసిన వ్యక్తి బాబూరావు అని కొనియాడారు. తనను వ్యక్తిగతంగా అభిమానించే వారన్నారు.