కోనసీమ: రాజోలుకు చెందిన ఇద్దరు ఇంటర్ చదువుతున్న విద్యార్థినిలు చదువుపై ఆసక్తి లేక, ఒత్తిడి తట్టుకోలేక మంగళవారం ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బస్టాండ్లో ఉన్న సీసీ కెమెరాల సహాయంతో వారిని పట్టుకుని మంగళవారం రాత్రి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. రాజమండ్రి బట్టల షాపులో పని చేయడానకి ప్రయత్నించినట్లు తెలిపారు.