ATP: కళ్యాణదుర్గంలో నవంబర్ 8న జరగనున్న భక్త కనకదాస జయంతి, విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించనుండగా.. జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.