కోనసీమ: వాయుగుండం కారణంగా వీస్తున్న ఈదురు గాలులకు అమలాపురం రూరల్ మండలం పాలగుమ్మి పెదపేటలో రోడ్డుకు అడ్డంగా భారీ వృక్షం కూలిపోయింది. చెట్టు కూలే సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దాంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. రోడ్డుకు అడ్డంగా కూలిన వృక్షాన్ని వెంటనే తొలగించాలంటూ వాహన చోధకులు, స్థానికులు కోరుతున్నారు.