కృష్ణా: రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 5న నిర్వహించనున్న మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి కోనశశిధర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి నిన్న నిర్వహించిన మెగా పేరెంట్, టీచర్స్ సమావేశంపై వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ బాలాజీ పాల్గొన్నారు.