సత్యసాయి: సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తి పట్టణంలో కొత్తగా బహుళ భాషా సందేశ ఫలకాలను (Multi-Language Sign Boards) ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తుల కోసం స్వామి వారి దివ్య సందేశాలను, సూక్తులను తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ బోర్డులపై ప్రదర్శిస్తున్నారు. ఈ నూతన ఏర్పాట్లు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.