కృష్ణా: కూటమి ప్రభుత్వం సహకార వ్యవస్థ అభివృద్ధికి కృషి చేస్తోందని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. సోమవారం కోడూరు మండలం సాలెంపాలెంలో పీఏసీఎస్ నూతన అధ్యక్షులుగా కొప్పనాతి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సత్కరించారు. కూటమి ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా సొసైటీ ద్వారా రైతులకు సేవ చేయాలని ఆయన కోరారు.