BHNG: రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. భువనగిరిలో 13.2 సెం.మీ, యాదగిరిగుట్టలో 11.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. తుర్కపల్లి (8.8 సం.మీ), మర్యాల (8.6 సం.మీ), నందనం (7.8 సం.మీ)లోనూ భారీ వర్షం కురిసింది. వర్షానికి యాదగిరిగుట్ట బస్స్టాండ్ జలమయమైంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.