E.G: సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి కోరుకొండ MRO కార్యాలయం వద్ద “ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాజానగరం ఎమ్మెల్యే బత్తులు రామకృష్ణ తెలిపారు. నియోజవర్గం ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేయవచ్చని సూచించారు. సంబంధిత అధికారుల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వివరించారు.