NLR: తోటపల్లి గూడూరు మండలంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం నుంచి వర్షం దంచి కొడుతుంది. ఈ నేపథ్యంలో లోతట్టు ముంపు ప్రాంతాల ప్రజలను మండలంలోని చెన్నపల్లి పాలెం హైస్కూల్, చింతోపు, నరుకూరు ప్రభుత్వ పాఠశాలలకు తరలించారు. ఇవాళ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలను సందర్శించారు. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.